Sanath Nagar 8 Years Old Boy Incident || ఇమ్రాన్ ఎలాంటి వాడంటే..? స్థానికులు చెప్పిన నిజాలు || RTV

Sanath Nagar 8 Years Old Boy Incident || ఇమ్రాన్ ఎలాంటి వాడంటే..? స్థానికులు చెప్పిన నిజాలు || RTV

అప్పుగా తీసుకున్న మొత్తం తిరిగిచ్చేయాలని ఒత్తిడి చేసినందుకు కసి పెంచుకొని ఆ వ్యక్తి కుమారుడిని దారుణంగా హత్య చేశాడొకడు! బాలుడిని గొంతు పిసికి చంపి.. ముక్కలుగా నరికి, అవయవాలను మూటగట్టి ఓ ఆటోడ్రైవర్‌తో నాలాలో పడేయించాడు. సనత్‌నగర్‌ అల్లావుద్దీన్‌ కోటిలో ఈ ఘటన జరిగింది. హతుడు 8 ఏళ్ల అబ్దుల్‌ వహీద్‌! ఇంతటి దారుణానికి ఒడిగట్టింది ఇమ్రాన్‌ ఖాన్‌ అలియాస్‌ ఫిజాఖాన్‌ అనే హిజ్రా! పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక వస్త్ర వ్యాపారి వసీం ఖాన్‌కు ముగ్గురు సంతానంలో అబ్దుల్‌ వహీద్‌ ఏకైక కుమారుడు. వసీం ఇంటికి దగ్గర్లోనేఇమ్రాన్‌ ఉంటున్నాడు. నిండా అప్పుల్లో కూరుకుపోయిన ఇమ్రాన్‌ అప్పులిచ్చిన వారి నుంచి తప్పించుకునేందుకు మూడేళ్ల నుంచి హిజ్రా వేషంలో తిరుగుతున్నాడు. కరోనా సమయంలో వసీం దగ్గర కూడా ఇమ్రాన్‌ పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నాడు. పైగా చిట్టీల దందా చేసే ఇమ్రాన్‌ వద్ద వసీం చిట్టీ వేయగా, ఆ డబ్బూ అతడు తిరిగివ్వలేదు. డబ్బు అడిగినప్పుడల్లా వసీంతో ఇమ్రాన్‌ గొడవ పెట్టుకునేవాడు. డబ్బు విషయంలో వసీం గురువారం మధ్యాహ్నం మరోసారి ఇమ్రాన్‌ను నిలదీశాడు. ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ గొడవను మనసులో పెట్టుకున్న ఇమ్రాన్‌ సాయంత్రం ఐదింటికి మసీదు వద్ద ఉన్న వసీం కుమారుడు వహిద్‌ను ఇంటికి పిలిపించుకున్నాడు. కిరాణా షాప్‌కు వెళ్లి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తీసుకురమ్మని ఆ బాబుకు డబ్బులిచ్చాడు. ఆ ప్యాకెట్లు తీసుకొని ఇంట్లోకి వహీద్‌ వెళ్లగానే ఇమ్రాన్‌ తలుపులు మూసేశాడు. అనంతరం వహీద్‌ గొంతు నులిమి హత్య చేశాడు.

He brutally killed the man’s son because of pressure to return the borrowed amount! He strangled the boy, cut him into pieces, wrapped his limbs and threw him in Nala with an auto driver. The incident took place in Allauddin Koti, Sanatnagar. The killer is 8-year-old Abdul Waheed! Imran Khan Alias Fiza Khan is a Hijra who is responsible for such atrocity! According to the police, Abdul Waheed is the only son of three children of a local cloth merchant Wasim Khan. Imran is staying near Wasim’s house. Debt-laden Imran has been disguised as a Hijra since three years to escape from the lenders. Imran also borrowed a large amount of money from Wasim during Corona. Moreover, Wasim gave a ticket to Imran, who was a ticket dealer, but he did not return the money. Imran used to fight with Wasim whenever he asked for money. On Thursday afternoon, Wasim once again confronted Imran over the money issue. This led to an argument between the two. Keeping this quarrel in mind, Imran called Wasim’s son Wahid who was at the mosque at five in the evening. He paid that Babu to go to the grocery shop and bring ORS packets. Imran closed the door when Waheed went inside the house with the packets. Later, Waheed killed him by slitting his throat.

#sanathnagaraincident #telangananews #rtv #8yearsoldboyincidentinsanathnagar

Like Us On Facebook : https://www.facebook.com/RTVTeluguNews/
Follow Us On Instagram : https://www.instagram.com/rtvnewsnetwork/
Follow Us On Twitter : https://twitter.com/RTVnewsnetwork

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *